కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం.. రైతన్న దైన్యం
ABN , Publish Date - May 11 , 2026 | 12:11 AM
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతుండడంతో రైతులు దిగాలు చెందు తున్నారు.
వేములవాడ, మే 10 (ఆంధ్రజ్యోతి) : ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతుండడంతో రైతులు దిగాలు చెందు తున్నారు. వేములవాడ పట్టణం, రూరల్, అర్బన్ మండలంలో కలిసి మొత్తం మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో పలు ధాన్యం కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా పలు గ్రామాల్లో స్వశక్తి సంఘాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతు పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తుండడంతో కల్లాల్లోని రాశులుగా పోసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆశించిన మేర కొనుగోల్లు జరగకపోవడం తోనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
25 శాతమే పూర్తయిన కొనుగోళ్లు..
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాలు, అధికారులు చెబుతు న్నప్పటికి ఆచరణకు నోచుకోవడం లేదనే విమర్శలు విని పిస్తున్నాయి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు దర్శ నమిస్తున్నాయి. తేమ పేరుతో అధికారులు కొంత ఆల స్యం చేస్తున్నట్లు రైతులు చెబుతుండగా, మరికొంత మంది రైతుల తేమ శాతం వచ్చి పక్షం రోజులవుతున్నా తూకం వేయడం లేదని, అన్ని పనులు వదులుకుని నిత్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వేములవాడ సింగిల్‌విండో ఆధ్వర్యంలో వేములవాడ, మల్లారం, బొల్లారం, హన్మాజీపేట, లింగంపేట, వట్టెంల, నూకలమర్రి, మర్రిపల్లి, చెక్కపల్లి, వెంకటాంపల్లి, శాత్రా జుపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ గా 2లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు అంచనా ఉండగా ప్రస్తుతం 54 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం కొనుగోలు చేపట్టారు. నాంపల్లి సింగిల్‌విండో ఆధ్వర్యంలో నాంపల్లి, అనుపురం రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయ గా ఇప్పటి వరకు 6వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా 25వేల క్వింటాళ్ల ధాన్యం రానున్నట్లు అంచనా లున్నాయి. రుద్రవరం సింగిల్‌విండో ఆధ్వర్యంలో సంకెప ల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా మొత్తం 9 వేల క్వింటాళ్ల ఽధాన్యం కొనుగోలు అంచనా ఉండగా ప్రస్తుతం 2 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం కొను గోలు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో సమస్యలెన్నో..
వేములవాడ పట్టణం, అర్భన్, రూరల్ మండలాల పరిధిలోని ఆయా కొనుగోలు కేంద్రాల్లో రైతన్నలకు అనేక సమస్యలు ఎదరవుతున్నాయి. రైతులు ధాన్యం సేకరించి కేంద్రానికి తీసుకువచ్చి నెలలు గడుస్తు న్నా కొనుగోలు చేయడం లేదని అన్నదా తలు వాపోతున్నారు. సంబంధిత సిబ్బందిని అడిగితే రోజుకొక కారణం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ధాన్యం కల్లాలకు వచ్చిన ప్పుడు తేమ పేరుతో జాప్యం చేయగా తేమ వచ్చిన తరువాత కూలీలని, ఆ తరు వాత లారీలని, తదనంతరం మిల్లుల జాప్యమని చెప్పి నమ్మబలుకుతున్నా రని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైన సంబందిత అధికారులు చర్యలు తీసు కుని మిల్లుల్లో త్వరితగతిన ధాన్యం దిం చేలా చర్యలు తీసుకోవాలని, కూలీలు, లారీల కొరతలేకుండా చూడాలని రైతన్నలు జిల్లా స్థాయి అధికారులను వేడుకుంటున్నారు.
అకాల వర్షానికి భయమేస్తోంది..
- రవీందర్, రైతు వేములవాడ
ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులు కావ స్తోంది. మొత్తం 8 ఎకరాల్లో వరి సాగు చేయగా రెండు కొనుగోలు కేంద్రాల పరిధిలోని పంటను రెం డింటిలోకి తరలించారు. ఒక్క చోట తేమ వచ్చి నెల అవుతున్నా కొను గోళ్లలో జాప్యం జరుగుతోంది. మరోచోట 15రోజులు అవు తున్నా తూకం వేయడం లేదు. లారీల కొరత లేకుండా, మిల్లులో ధాన్యం త్వరగా దించుకునేలా ప్రభుత్వం చొర వతీసుకుంటే సిబ్బంది ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చిర జల్లులు పడుతే భయమేస్తోంది. అకాల వర్షం పడితే ధాన్యం కొట్టుకుపోయే అవకాశం ఉటుంది. త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి.