పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:40 AM
టెక్స్‌టైల్, పవర్‌లూమ్ పరిశ్రమల అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి, అల్ ఇండియా టెక్స్‌టైల్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కరుమలయన్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : టెక్స్‌టైల్, పవర్‌లూమ్ పరిశ్రమల అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి, అల్ ఇండియా టెక్స్‌టైల్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కరుమలయన్ డిమాండ్ చేశారు. అలాగే సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించి కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఐటీయూ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సమావే శాల్లో భాగంగా ఆదివారం ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథు లుగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి కరు మలయన్‌లతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కరుమలయన్ మాట్లా డారు. దేశంలోనే వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ ఆదాయాన్ని అందిస్తున్న టెక్స్‌టైల్ పవర్‌లూమ్ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒక వైపు సరిపడా నిధులను కేటాయించకుండా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ, మరో వైపు కార్మి కులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పవర్‌లూమ్ పరిశ్రమలకు ప్రధా న కేంద్రమైన సిరిసిల్లలో కార్మికులకు సంబంధించిన వర్కర్ టూ ఓనర్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించి కార్మికులను యాజమానులు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్‌టైల్ పవర్‌లూమ్ పరిశ్రల అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. వస్త్ర పరిశ్రమలకు 10హెచ్‌పీల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి కార్మికులకు సంక్షేమ పఽథకాలను అందించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో సీఐటీయూ టెక్స్‌టైల్ ఆల్ ఇండియా కమిటీ, తెంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూని యన్‌ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని, కార్మికులందరు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ బహిరంగసభలో సీఐటీయూ ఆల్ ఇండియా టెక్స్‌టైల్ కో-ఆర్డినేషన్ కమిటీలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు చంద్రన్, సునీల్ ఛౌహన్, అశోకన్, పెరుమాళ్, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యు లు సోమన్న, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ తదితరులు పాల్గొన్నారు.