Share News

వాగ్దానాల అమలులో ప్రభుత్వాలు విఫలం

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:12 AM

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజే పీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విఫలమైనాయని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌ అన్నారు.

వాగ్దానాల అమలులో ప్రభుత్వాలు విఫలం

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజే పీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విఫలమైనాయని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్మిక వాడల్లో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్రలను ప్రారంభించారు. స్థానిక కార్మిక క్షేత్రమైన బీవైనగర్‌ చౌరస్తాలో సుద ర్శన్‌, పట్టణ కార్యదర్శి పంతం రవి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను సహజ వనరులను గంపగుత్తగా కార్పొరేట్‌ సంస్థలకు, అంబానీ, ఆదానీలకు అప్పజెప్పుతోందని ఆరోపించారు. దేశంలోని సామాన్య మధ్య తరగతి ప్రజలు జీవించడానికి కూడా వీలు లేకుండా అన్నిరకాల నిత్యావసర సరుకుల ధరలను పెంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యా, వైద్యం, కూడు, గూడు, గుడ్డ ప్రజలకు అందుబాటులో లేకుండా కేంద్ర ప్రభుత్వ చేసస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలను చేసిందని, అయితే అవేవీ అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఇచ్చిన 10 శాతం యారన్‌ సబ్సిడీ తొలగించి వర్కర్‌ టూ ఓనర్‌ పథకాన్ని తుంగలో తొక్కే ప్రయ త్నాన్ని ప్రభుత్వం చేపట్టడం దుర్మార్గం అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్న వస్త్ర పరిశ్రమకు పూర్తిగా న్యాయం జరగలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీ ఐ నియోజకవర్గం ఇన్‌చార్జి గుంటి వేణు, జిల్లా నాయకుడు సోమ నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:12 AM