పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:53 PM
పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. బోయినపల్లి మండలం లోని మనువాడ గ్రామానికి చెందిన అవనిగంటి ఉమేష్ తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతూ వ్యాధి నయం కోసం ఉమేష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిప ల్లి సత్యం బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ పరిస్థి తిని కలెక్టర్‌తో ఫోన్ వివరించాడు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు వెంటనే ఉమేష్ చికిత్స కోసం కలెక్టర్ గరిమ అగర్వాల్ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఆ చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మం డల అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, నాయకులు వన్నెల రమణారెడ్డి, జోగ్గు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.