భీమన్న సన్నిధిలో ప్రభుత్వ విప్ పూజలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:28 AM
వేములవాడలోని రాజరాజే శ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : వేములవాడలోని రాజరాజే శ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ తానెత్తు తులా భారం (బెల్లం) సమ ర్పించి పంచిపెట్టారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఈసందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమా దేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూప్రసాదాన్ని అందజేశారు. వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలిస్తే ఆయనెత్తు తులాభారం బెల్లం పంచిపెడతామ ని మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మి దంపతులు మొక్కుకున్నారు. బుధవారం వారు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి సన్నిధిలో మొక్కును చెల్లించుకున్నారు.