లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:33 AM
రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకున్నారు.
రుద్రంగి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సామ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను సన్మానించి, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఇటీవల ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగ నర్సయ్య, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, గట్ల మీనయ్య, తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, కేసిరెడ్డి నర్సారెడ్డి, కొమిరె శంకర్, పల్లి గంగాధర్, పూదరి మహిపాల్, ఎర్రం అరవింద్, ఎర్రం రాజలింగం, దయ్యాల శ్రీని వాస్, ఈర్నం నవీన్, తదితరులు పాల్గొన్నారు.