Share News

దుర్గామాతను దర్శించుకున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:29 AM

మండల కేంద్రంలోని ఇందిరా చౌక్‌ చౌరస్తాలో సర్వజన గణేష్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ సువర్ణ దుర్గాదేవి అమ్మవారిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

దుర్గామాతను దర్శించుకున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

రుద్రంగి, ఆక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని ఇందిరా చౌక్‌ చౌరస్తాలో సర్వజన గణేష్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ సువర్ణ దుర్గాదేవి అమ్మవారిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనను సత్కరించి అమ్మవారి జ్ఞాపిక అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, సర్పంచ్‌ గండి నారాయణ, కాంగ్రెస్‌ పార్టీ మం డల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, ఉప సర్పంచ్‌ మాడిశేట్టి అభి లాష్‌, గట్ల మీనయ్య, తర్రె మనోహర్‌, పిల్లమారపు ప్రవీణ్‌, కమిటీ సభ్యులు పాల్గోన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:29 AM