రైతుల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం అండ
ABN , Publish Date - May 28 , 2026 | 11:46 PM
రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, మే 28(ఆంధ్రజ్యోతి) : రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో గురువారం పొద్దుతిరుగుడు, వరిరైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నుముక అని, రైతుల సంక్షమమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రైతుల అభివృద్ధి ముఖ్యమైనదని అన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారని అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. రైతుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ప్రజాప్రభుత్వం కొనసాగుతుందని సూచించారు. కార్యక్రమంలో ఏఎమ్‌సీచైర్‌పర్సన్ ఐరెడ్డి చైతన్యమహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్యలతో పాటు నాయకులు పాల్గొన్నారు.