Share News

కుల సంఘాలకు ప్రభుత్వం అండ..

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:54 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాలకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

కుల సంఘాలకు ప్రభుత్వం అండ..

సిరిసిల్ల టౌన్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాలకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంల ఆవరణలో విశ్వకర్మ కార్పెంటర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ సిరిసిల్ల పట్టణ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరైన్నారు. ముందుగా నూతన కార్యవర్గం సభ్యుల ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ విశ్వకర్మలకు ఎలవేళల సహాయ సహకారలు అందిస్తామన్నారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రభుత్వ విప్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, గ్రంథాలయం జిల్లా చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, మార్కెట్‌ కమిటి చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, బొద్దుల శ్రీనివాస్‌, ఆడెపు చంద్రకళ, వెంగళ లీలా, తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జలగం ప్రవీన్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:54 PM