నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:45 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రీపైమ్రరీ స్కూళ్లన ఏర్పా టు చేసిందని చిన్నారుల తల్లిదండ్రుల ఈ అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి అన్నారు.
బోయినపల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రీపైమ్రరీ స్కూళ్లన ఏర్పా టు చేసిందని చిన్నారుల తల్లిదండ్రుల ఈ అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక, గుండన్నపల్లి, కోరం గ్రామాలలో నూతనంగా మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూల్‌లను జిల్లా విద్యాధికారి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపా ధ్యాయులు జిల్లా విద్యాధికారికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలను అందజేశారు. ప్రీప్రైమరీ స్కూళ్లను ప్రారంభించిన అనంతరం చిన్నారు లకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. అలాగే బోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేం దుకు ప్రీప్రైమరీలను ఏర్పాటు చేసిందని అన్నారు. గత సంవత్సరం 14 స్కూళ్ళను జిల్లాలో మంజూరు చేయగా ఈ సంవత్సరం 48 స్కూళ్లను మంజూరు చేసిందన్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్‌లలో నాలుగు సంవత్స రాలు నిండిన విద్యార్థులను పాఠశాలకు పంపియాలని తల్లిదండ్రులను కోరారు.ఒక పాఠశాలకు ఒక టీచర్‌తోపాటు ఆయాను నియమిస్తున్న ట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఒక్కోపాఠశాల మీద లక్షన్నర రూపా యల విధులను వెచ్చిస్తుందని ఈ నిధులతో చిన్నారులకు ఫర్నిచర్ తోపాటు ఆట బొమ్మలు, తరగతి గదిని పెయింట్‌తో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు నల్లమోహ న్ కొప్పుల లావణ్య, జంపకమాధవి, కత్తెరపాక మంజుల, వార్డు సభ్యు లు చౌదరి శ్రీధర్, అమ్మిగల్ల గోపాల్, నాయకులు మెరుపుల జలంధర్, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు పిట్టల జలజ, ఉపాధ్యాయులు కనక య్య, సత్యనారాయణ, భూమయ్య, బొలగం శ్రీనివాస్‌లు ఆయా పాఠ శాలల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.