అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:24 AM
అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సంపూర్ణ న్యాయం జరుగుతోందని రాష్ట్ర వక్బ్‌బోర్డు చైర్మెన్ సయ్యద్ అజ్మ తుల్లాహుస్సేనీ పేర్కొన్నారు.
గంభీరావుపేట, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సంపూర్ణ న్యాయం జరుగుతోందని రాష్ట్ర వక్బ్‌బోర్డు చైర్మెన్ సయ్యద్ అజ్మ తుల్లాహుస్సేనీ పేర్కొన్నారు. గంభీరావుపేటలో చారిత్రక జామా మసీద్ విస్తరణ, మరమ్మతులకు రూ.45 లక్షల అంచనాలతో అజ్మతుల్లాహుస్సేనీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అజ్మతుల్లాహుస్సేనీ మాట్లాడుతూ తన స్వగ్రామమైన గంభీరావుపేటను అన్ని రంగాల్లో అభి వృద్ధి చేస్తానని, అందులో భాగంగా గతంలో రూ.90 లక్షల అంచనాలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీ వల మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు, మార్కెట్ షెడ్డు నిర్మాణానికి, సీసీరోడ్లకు నిధులు మంజూరుచేసినట్టు, రానున్న రోజుల్లో గంభీరావుపేట అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరుచేస్తామన్నారు. గంభీరావుపేట లోని జామామసీద్ ముఖ్యమైన ఆధ్మాత్మిక కేంద్రంగా నిలిచిందని, మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు విస్తరణలో భాగంగా మరమ్మతులు చేపట్టేందు కు నిర్ణయించామన్నారు. విస్తరణ పనులు త్వరగా పూర్తిఅయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రూ.90 లక్షలతో నిర్మాణం కొనసాగుతున్న కమర్షియల్ క్లాంపెక్స్ పనులు పూర్తికాగానే మంత్రులతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ సభ్యు లు అజ్మతుల్లాహుస్సేనీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ మహబూబ్‌అలీ, ముస్లిం మైనార్టీ నాయకులు సాదతుల్లాహుస్సేనీ, జుబేర్, అస్లాం, అసదుల్లా, హాఫీజ్ అబు ల్ కలాం, యాసీన్, హాస్మీ, వసీమ్, సఫీయొద్దీన్, నయీర్, రహీమొద్దీన్, తాహేర్, షరీప్, విలాయతుల్లా, హరీప్, నాసీర్, పురావస్తు సంరక్షణ నిపు ణుడు మీర్ బరఖతుల్లాఖాన్ తదితరులు ఉన్నారు.