Share News

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:43 AM

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
టాస్‌ వేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ఫ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ఫ కోరుట్లలో కేపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

కోరుట్ల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని జూనియర్‌ కళాశా లలో శనివారం కోరుట్లలో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ స్మార కార్థం నిర్వహించిన ప్రీమీయర్‌ లీగ్‌ ఆరవ సీజన్‌ క్రికెట్‌ టోర్న మెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. యువత డ్రగ్స్‌ మహమ్మారికి బానిస కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవా లని కోరారు.

కులం, మతం వంటి అస మానతలకు తావు లేకుండా అన్ని వర్గాలు కలిసి ఉండి స్నేహ పూర్వక వాతావరణం కేవలం క్రీడా మైదానంలో మాత్రమే ఉం టుందని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ల అధిక వినియోగం తగ్గించి చదు వు, క్రీడల పట్ల యువత దృష్టి సారించాలని కోరారు. కోరుట్లలో క్రీడా మైదానంకు నిఽఽధులు మంజూరు చేయడానికి ఫైనాన్స్‌ మంత్రితో మాట్లాడతానన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడు తూ ముఖ్య మంత్రి క్రీడల పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తున్నారని అందుకుగాను సీఎం కప్‌ క్రీడలు నిర్వహిస్తున్నారని అన్నారు. యువత డ్రగ్స్‌కు బానిస అవుతూ జీవితాలను బుగ్గి పాలు చేసుకోకుండా ఆటలపై దృష్టి సారించి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలని కోరారు. పోలీస్‌ యంత్రాంగం డ్రగ్స్‌పై ఉక్కపాదం మోపాలని సూచించారు.

అనంతరం కోరుట్ల నియో జకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ కోరుట్లకు క్రీడా మైదానం ఏర్పా టుకు నిధులు మంజూరు చేసే బాధ్యత మంత్రి అడ్లూరిదేని అన్నారు. రాబోవు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాలను గెలిపించుకుంటా యన్నారు. అందుకుగాను మం త్రి అడ్లూరి బాధ్యత తీసుకోవా లని కోరారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో నియోజక వర్గంలో అత్యధికంగా 48 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ సత్య ప్రసాద్‌, మె ట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, మెట్‌పల్లి సీఐ అనిల్‌ కుమార్‌, కోరు ట్ల సీఐ సురేశ్‌ కుమార్‌, ఎస్సై చిరంజీవి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 12:43 AM