Share News

ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:59 AM

ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి

బోయినపల్లి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ అన్నారు. బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లి పైమ్రరీ పాఠశాలను గురు వారం కలెక్టర్‌ సందర్శిం చారు. పీఎంశ్రీలో భాగంగా సమగ్ర శిక్ష ద్వారా కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్తంభంపల్లి ప్రైమరీ పాఠశాలను నూతన హంగులతో ఆధునీకరించి ప్రీ పైమ్రరీ సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యాలయాన్ని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సందర్శించారు. పిల్లల ఫ్రెండ్లీ చిత్రాలు, పెయింటింగ్‌లు, ఫర్నిచర్‌ ఏర్పాటుచేయగా ఇన్‌చార్జి కలెక్టర్‌ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సంఖ్య ఏమేరకు ఉందని, వారికి ఏమి నేర్పిస్తున్నారో ఆరా తీశారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన పాఠశాలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య పెరి గేలా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా జిల్లాలోని పదమూడు మండలాల్లో ప్రీ పైమ్రరీ తరగతులు కొనసాగు తున్నాయి కలెక్టర్‌ పేర్కొన్నారు. అనంతరం ఉన్నత పాఠశా లను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. సైన్స్‌ కు సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వార్షిక పరీక్షలకు ప్రణాళిక ప్రకారం సిద్ధం కావా లని సూచించారు. స్కూళ్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేలా కృషి చేయాలని టీచర్లను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీఈ వో వినోద్‌ కుమార్‌, తహసీల్దార్‌ నారాయణరెడ్డి, ఎంపీవో శ్రీధర్‌, డీఈవో కార్యాలయ అధికారి శైలజ, సర్పంచ్‌ బొంగో ని అశోక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:59 AM