అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
ABN , Publish Date - May 23 , 2026 | 12:22 AM
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించ డమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.
కరీంనగర్, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించ డమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా పది అంశాలతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు. అధికారులు ప్రతి గ్రామం పర్యటించి ప్రజలతో మమేకమయ్యారన్నారు. వారి సమస్యలు తెలుకుని అవసరాలను గుర్తించారన్నారు. గ్రామ, మండల నియోజకవర్గ స్థాయిలో సభలు అభివృద్ధి పనుల ప్రారం భోత్సవం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రతి చివరి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు చేరే వరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నగర మేయర్ కొలనగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను త్వరితగిన పరిష్కరించా లన్నారు. అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు. సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకా లను ప్రజలకు తెలియజేయడం, చైతన్య పరచడం, భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి కార్యక్రమాల దృష్ట్యా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ అలం మాట్లాడుతూ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 1500 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిం చి 500 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ 66 డివిజన్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం ద్వారా సానిటేషన్ మెరుగు పరిచా మన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, అదనపు కలెక్టర్‌లు అశ్విని తానాజీ వాఖడే, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్‌బాబు, మున్సిపల్ ఛైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు పాల్గొన్నారు.
ఫ సర్పంచుల సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్
గ్రామాల్లో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న హెల్ప్‌డెస్క్ నిర్వహణ కోసం హెల్ప్‌లైన్ నంబర్లను కేటాయించి సర్పం చులకు తెలియజేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో సందర్శించి అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచా యతీ భవనాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. వాటిని పూర్తి చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల జమాఖర్చులను పర్యవేక్షించాలన్నారు. సిబ్బంది వేతనాలు, గ్రామ పంచాయతీ విద్యుత్ బిల్లులు వంటివి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు.