Share News

ప్రభుత్వ కార్యాలయాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలి

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:54 AM

ప్రభుత్వ కార్యాలయాల ను నిత్యం పరిశ్రుభంగా ఉంచేందుకు జిల్లా అధికారులు కృషి చేయాల ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అదేశించారు.

ప్రభుత్వ కార్యాలయాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలి

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ కార్యాలయాల ను నిత్యం పరిశ్రుభంగా ఉంచేందుకు జిల్లా అధికారులు కృషి చేయాల ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిరు పయోగ వస్తువులను తొలగించి చెత్తారెదారం లేకుండా మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరి ష్కరించే దిశగా అధికారులు పనిచేయాలన్నారు. కలెక్టరేట్‌లోని సమావే శమందిరంలో సోమవారం జిల్లా అధికారులతో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో చేపట్టిన 99 రోజుల కార్యక్రమాలను పకడ్భందీగా అమలు చేయడంపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్‌లోని అన్ని కార్యాలయాలతోపాటు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీలు, జిల్లాలోని అన్ని తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత పను లు పక్కాగా చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, అర్డీవోలు రాఽధాబాయ్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:54 AM