ప్రభుత్వ వైద్య సేవలను వివరించాలి
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:46 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి ప్రభుత్వ వైద్య సేవ లను వివరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచిం చారు.
తంగళ్లపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి ప్రభుత్వ వైద్య సేవ లను వివరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచిం చారు. గురువారం తంగళ్ల పల్లి మండలం నేరెళ్ల ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని కలె క్టర్ ఆకస్మికంగా తనిఖీ చే శారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, మందుల గది పీహెచ్‌సీ ఆవరణను పరిశీలించారు. వ్యాక్సిన్లు, మందుల నిలువలపై ఆరా తీశారు. రోజు ఆసు పత్రికి ఎంత మంది రోగులు వస్తున్నారు, గర్భిణులు ఎంత మంది వైద్య సేవలు పోందుతున్నారని ఆరా తీశా రు. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ వైద్యు లు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరు గైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరల పరిశుభ్రతపై వివరించాలి అన్నారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిం చాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలపాలని సూచించారు.
వ్యవసాయ కళాశాలను సందర్శన..
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని పలు విభాగాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ముందుగా కళాశాలలోని సాయిల్ సైన్స్, ఎంటమాలజీ, జెనెటిక్స్, ఫ్లాంట్ బ్రీడింగ్ విభాగాన్ని సందర్శించారు. అక్కడి నిర్వహిస్తున్న మట్టి, నీటి సమూనాల విశ్లేషన విధానాలు, హాని కలిగించే కీటకాలు, వాటి నివారణ పద్ధ తులపై అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. పంటల మెరుగైన కరాలను అభివృద్ధి చేయడానికి చేపడుతున్న పరిశోధన కార్యక్రమాలపై అధ్యాపకులు, విద్యార్థులు కలె క్టర్‌కు వివరించారు. విద్యార్ధులతో కలెక్టర్ మాట్లడుతూ కళాశాలలో అందుతున్న వసతులు, మౌళిక సదుపాయా ల కల్పన గూర్చి ఆరా తీశారు. ఈ సందర్శనంలో ఆద నపు కలెక్టర్ గడ్డం నగేష్, కళాశాల అసోషియేట్ డీన్ సునీత దేవి తదితరులు ఉన్నారు.