Share News

ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల నిరసన

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:29 AM

కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల నిరసన

భగత్‌నగర్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్‌లో మెడికల్‌ కళాశాల భవనం, హాస్టల్‌ భవనాలు వెంటనే పూర్తి చేసి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. శాశ్వత కళాశాల భవనం, హాస్టళ్లు రవాణా సౌకర్యాలు మెరుగు పర్చాలని డిమాండ్‌ చేశారు. నాలుగు బ్యాచ్‌లకు చెందిన వందలాది మంది వైద్య విద్యార్థులు యాప్రాన్లు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. కళాశాల ప్రారంభమై మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి తాత్కాలిక భవనంలోనే చదువులు కొనసాగించాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Updated Date - Nov 22 , 2026 | 12:29 AM