అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:33 AM
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
మల్యాల, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మల్యాల మండలంలోని పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్ అందించిన చీరలను మహిళలు పంట చేలల్లో వినియోగించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ చీరలను కట్టుకుంటున్నారని అన్నారు. కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన వారందరికీ నష్టపరిహం అందించి పునరావసం కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో 56మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, 30మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు. మల్యాల, కొడిమ్యాల మండలాలకు చెందిన ఆరుగురికి కులాంతర వివాహం కింద అందించే రూ 2.5లక్షల చొప్పున ప్రోత్సాహం, రామన్నపేటకు చెందిన రెండు కుటుంబాల గొర్రెలు మృతి చెందగా వారికి రూ.20వేల చొప్పున పంపిణీ చేశారు. దివ్యాంగులకు అందించే వాహనాన్ని తాటిపల్లికి చెందిన అట్ల రాముకు ఎమ్మెల్యే అందించి ఆయనతో వాహనంపై పయనించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ బత్తిని మల్లీశ్వరీశ్రీని వాస్‌గౌడ్, తహసీల్దార్ వసంత, ఎంపీడీవో స్వాతి, సర్పంచ్‌లు ఆదిరెడ్డి, జయ, హన్మంతు నాయకులు వీరబత్తిని శోభరాణీ, వెల్మ లక్ష్మారెడ్డి, ముత్యం శంకర్, కట్కం వినయ్, ముత్యంరెడ్డి, మ్యాక లక్ష్మన్, బండి రవి, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.