జగిత్యాలలో 450 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:34 AM
జగిత్యాల పట్టణంలో 450 పడకల సామర్థ్యంలో రూ.235 కోట్లతో నిర్మించ తలపెట్టిన నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం భూమి పూజ చేయనున్నారు.
నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి అడ్లూరి
ఫ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల అర్బన్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల పట్టణంలో 450 పడకల సామర్థ్యంలో రూ.235 కోట్లతో నిర్మించ తలపెట్టిన నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాతా శిశు కేంద్రం సమీ పంలో నిర్మించనున్న నూతన ఆసుపత్రి భవనంలో 450 పడకల సామర్థ్యం ఉంటుందన్నారు. జిల్లా ప్రజ లకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుం దన్నారు. నూతన ఆసుపత్రితో పాటు నిర్మాణం పూర్తి చేసుకున్న క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభంతో ప్రమాదాల పాలయిన వారికి ఉన్నత స్థాయి వైద్యం అందించే వీలుంటుం దన్నారు. క్రిటికల్ కేర్ బ్లాక్ మరియు నూతన ఆసుపత్రి వల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీలకు ఉపయోగం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రి రాజనర్సింహ, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో వైద్యానికి, విద్యకు అత్యదిక నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభంతో అత్యవసర ప్రసూతి శస్త్ర చికిత్సలతో పాటు డయాలసిస్, మూడు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చల్గల్ వాలాంతరి క్షేత్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మినీ స్టేడియం, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానాసుపత్రి సూపరింటెండెంట్ జివి. కృష్ణమూర్తి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సునీల్, ఈఈ విశ్వప్రసాద్, డీఈ రాజారెడ్డి, ఆర్‌ఎంఓలు డాక్టర్ ఆగంతపు నరేష్, శ్రీపతి, గీతిక, స్వరూప, మాజీ పాక్స్ చైర్మన్ నోముల శేఖర్, సందీప్ రావు తదితరులు పాల్గొన్నారు.