విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:39 AM
విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌లోని అమృత్‌లాల్‌శుక్లా కార్మిక భవనంలో బుధ వారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కాంత్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు తాము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని పూర్తిగా అభివృద్ధి బాటలో ఉంచుతామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యా ర్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్‌లను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా జాప్యం చేస్తుందన్నారు. పైచదువులకు వెళ్దామంటే ప్రైవేట్ కళాశాలలో సర్టిఫికెట్ ఇవ్వకుం డా యాజమాన్యాయాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బం దులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను విడుదల చేయడం తోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు మూత్రశాలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను కల్పించాలన్నారు. ఖాళీ గా ఉన్న ఉపాధ్యాయుల పోస్ట్‌లను వెంటనే భర్తీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్ట ళ్లలో గురుకులాలను అద్దె భవనాల్లో కొనసాగుతున్నా యని వాటికి సొంత భావనాలు నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థు లు పోరాటాలు చేస్తే పనిచేయాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదన్నారు. తక్షణమే జీవోను రద్దు చేయాలి విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడంతోపాటు మధ్యాహ్న భోజ నాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ, ముభా రక్, రషీద్, సృజన్ శ్రీతన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.