క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:32 AM
విద్యార్ధి దశ నుంచే క్రీడలకు ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రోత్స హిస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : విద్యార్ధి దశ నుంచే క్రీడలకు ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రోత్స హిస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం కప్ 2026 పోటీల ప్రారంభం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరి మ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేతో కలసి ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి స్థా నిక చేనేత విగ్రహాం వరకు విద్యార్థులు, క్రీడాకా రులతో కలసి విప్, ఇన్‌చార్జి కలెక్టర్, ఎస్పీ, కాం గ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో దేశంనుంచి ఎక్కువ సంఖ్యలో పత కాలు సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రజా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోందన్నారు. సీఎం కప్ పేరిట రాష్ట్రంలోని గ్రామ స్థాయి నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి అంతర్జాతీయస్థాయి పోటీల్లో రాణించేలా ప్రోత్సా హం అందిస్తోందన్నారు. సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించాలి
జిల్లాలోని విద్యార్థులు,క్రీడాకారులు సీఎం కప్ పోటీల్లో పాల్గొని జిల్లాకు ఎక్కువ పతకాలను తీసుకురావాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవా ల్ అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యం, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందన్నారు. సీఎం కప్ టార్చ్ ర్యాలీలు సిరిసిల్లలో మొదలై జిల్లాలోని అన్ని మండలాలలో సాయంత్రం వరకు పూర్తి అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ షెడ్యుల్ ప్రకారం జిల్లాలో మొత్తం 34 విభా గాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి పోటీలు నిర్వహించి జిల్లా జట్లు, క్రీడాకారులను ఫిబ్రవరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. సీఎం కప్ పోటీల్లో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈనెల 17 నుంచి 22 వరకు గ్రామ పంచాయతీ స్థాయి, ఈనెల 28 నుంచి 31 వరకు మండల స్థాయి, మున్సిపల్ జోనల్ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 5వరకు నియో జవర్గాల స్థాయి, ఫిబ్ర వరి 9నుంచి 12 వర కు, జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలు జరుగుతాయని తెలి పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాం దాస్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌భేగం, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.