క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించేందుకు ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:02 AM
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రానికి రూ. 12 కోట్లతో మినీ స్టేడియం మంజూరు కావడంతో బుధవారం సంబరాలు నిర్వహించారు. మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై యువత, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ చూపిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి సైతం క్షీరాభిషేకం చేశారు.
డప్పు చప్పుళ్లతో స్వాగతం...
మినీ స్టేడియం మంజూరులో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ చూపారని మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భం గా బోయినిపల్లి మండల కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు యువత, కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు, ఉత్సాహభరిత నినాదాలతో ఎమ్మెల్యేను ఆహ్వా నించారు. అనంతరం నిర్వహించిన ఒగ్గుడోలు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
యువతకు ఎంతో ఉపయోగం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లా డుతూ బోయినిపల్లి మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణంతో యువతకు క్రీడా సౌకర్యాలు మరింత అందుబాటులోకి వస్తాయని అన్నారు. క్రీడల్లో ప్రతిభను చాటుకునే యువతకు మినీ స్టేడియం ఎంతో ఉపయో గపడుతుందని తెలిపారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ర్యాలీ అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముందుగంటి సురేందర్‌రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువిన్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు భీమ్ రెడ్డి మహేశ్వర్‌రెడ్డి, ఏనుగుల కనకయ్య, నల్ల మోహన్ సుద్దాల మధుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.