భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే..
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:45 AM
గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని జిల్లాలోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక పార్థనలు చేశారు.
సిరిసిల్ల ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని జిల్లాలోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక పార్థనలు చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో కీర్తనలు, బైబిల్ బోధనలను ఫాస్టర్‌లు వినిపించారు. ఏసుక్రీస్తు శిలువ వేయబడిన రోజును గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు జరుపుకుంటారు. ఏసు మరణించిన, సందేశం ఇచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈస్టర్‌కు ముందు 40రోజుల ఉపవాస దీక్షకాలాన్ని కూడా గడిపారు. చర్చిల్లో పెద్దఎత్తున కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక అలంకరణ లు చేసి గుడ్ ఫ్రైడేను జరుపుకున్నారు.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాలతో పాటు నారాయణపూర్, బండలింగంపల్లి, బొప్పాపూర్, దుమాల, గొల్లపల్లి, అల్మాస్‌పూర్, రాజన్నపేట, గర్జనపల్లి, వన్‌పల్లి, తదితర గ్రామాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోకరక్షకుడు ఏసు అని, ఆయన చూపిన మార్గంలో పయనించాలని పాస్టర్లు ప్రవచించారు. గీతాలాపానలు చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట : పాపులను రక్షించడానికే ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేశాడని సియెల్ ఎవాంజికల్ చర్చి పాస్టర్ ఎరవెల్లి మోజేస్ పేర్కొన్నారు. మండలంలోని ఇల్లంతకుంట, అనంతారం, గాలిపెల్లి, నర్సక్కపేట, పొత్తూరు తదితర గ్రామాల్లోని చర్చిల్లో శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని అన్నారు. ఈసందర్భంగా చర్చిలో ఏసుక్రీస్తు జీవిత చరిత్రకు సందబంధించిన నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమాలలో పాస్టర్లు సత్యప్రకాష్, ఏసయ్యబాబులతో పాటు పలు గ్రామాల క్రైస్తవులు పాల్గొన్నారు.