Share News

గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహించాలి

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:22 AM

గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వ హించేందుకు ప్రణాళికలు రూపొందిం చాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమా ర్‌ అన్నారు.

గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహించాలి
మాట్లాడుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

జగిత్యాల, జనవరి3 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వ హించేందుకు ప్రణాళికలు రూపొందిం చాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమా ర్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం లో కలెక్టర్‌ సత్య ప్రసాద్‌తో కలిసి అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహిం చేందుకు ముందస్తు ఏర్పా ట్లు చేసుకోవాలని ఆదేశించారు.

మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయం చేసుకోవా లన్నారు. పుష్కరాలకు మరో ఏడాదిన్నర సమ యం ఉన్నందున ధర్మపురి పట్టణాన్ని ఆధ్యాత్మి క పట్టణంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధా న్యతనిచ్చి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పిం చేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయా లని సూచించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ఉన్న గ్రామాల్లో పుష్క ర ఘాట్లను ఏర్పాట్లు చేయాల్సిన అవ సరం ఉంటుందని అధికారులకు సూచిం చారు. గోదావరి నది వెంట పురాతన ఆలయా లను గుర్తించి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ర్లు లత, బి.రాజగౌడ్‌, ఆర్డీవో మధుసూదన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 01:22 AM