Share News

గడపగడపకు వెళ్లి చేసిన అభివృద్ధి వివరించాలి

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:14 AM

ఎన్నికల్లో ప్రతిఅభ్యర్థి, నాయకులు, కార్య కర్తలు గడపగడపకు వెళ్లాలని, మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగరాలని బీఆర్‌ ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు మార్గనిర్దేశం చేశారు.

గడపగడపకు వెళ్లి చేసిన అభివృద్ధి వివరించాలి

సిరిసిల్ల, జనవరి 30 (ఆంరఽధజ్యోతి): ఎన్నికల్లో ప్రతిఅభ్యర్థి, నాయకులు, కార్య కర్తలు గడపగడపకు వెళ్లాలని, మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగరాలని బీఆర్‌ ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు మార్గనిర్దేశం చేశారు. మున్సి పల్‌ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్‌ వార్డుల్లో ఎక్కువ సంఖ్యలో పోటీకి అభ్యర్థులు సిద్ధం కావడంతో వారితో విడివిడిగా చర్చలు అభ్యర్థులను ఖరారు చే శారు. గురువారం, శుక్రవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నా యకులు, ఆశావాహులతో సమావేశమయ్యారు. మున్సిపల్‌ 31వ వార్డు నుంచి పాశికంటి లవన్‌, ఐదో వార్డు నుంచి మోసిన్‌ తన అనుచరులతో బీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరారు. మాజీ మంత్రి కేటీఆర్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలని అన్నారు. ప్రతి అభ్యర్థి గెలిచి రావాలని, అందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సమన్వయకర్త తుల ఉమ,బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌ రావు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు చీటీ నర్సింగరావు, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 12:14 AM