Share News

జీవో 97ను రద్దు చేయాలి

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:26 AM

పాలిటెక్నిక్‌ విద్యను నిర్వీ ర్యం చేయడంతోపాటు ప్రైవేటీకరణ దిశగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 97 జీవోను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్‌ డిమాండ్‌ చేశారు.

జీవో 97ను రద్దు చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : పాలిటెక్నిక్‌ విద్యను నిర్వీ ర్యం చేయడంతోపాటు ప్రైవేటీకరణ దిశగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 97 జీవోను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశా లలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతూ తీసుకువచ్చిన విధానాలను రద్దు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అగ్రహారం పాలిటె క్నిక్‌ కళాశాల నుంచి సుమారు ఐదు వంద మంది విద్యార్థులతో మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. కలెక్టరేట్‌కు చేరుకుని ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. తమ సమస్యలను కలెక్టర్‌ను కలిసేందుకు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లుతున్న విద్యార్థులను అక్కడే ఉన్న పోలీసులు అడుకున్నారు. పోలీసులు, విద్యార్ధుల మధ్య తోపులాట జరిగిం ది. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అక్కడికి చేరుకుని వాని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతామని చెప్ప డంతో శాంతించిన విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయుకులు జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా మల్లారపు ప్రశాంత్‌ మాట్లాడుతూ పాలిటెక్నిక్‌ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేసి తీసుకవచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ, నాయ కులు సాయిరాం, రషీద్‌, ముబారక్‌, జశ్వంత్‌, సాయితేజ, విజయ్‌,బాలాజీ, ఆదిత్య, రేహాన్‌, మానస, అభిజ్ఞ, సంజన, ప్రణీత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:26 AM