బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:13 AM
బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయాధికారులు ప్రీతి, బానోతు రాజేశ్వర్ సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు.
తిమ్మాపూర్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయాధికారులు ప్రీతి, బానోతు రాజేశ్వర్ సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవైనా వేధింపులు ఎదుర్కొంటే తల్లిదండ్రలకు చెప్పాలన్నారు. తల్లిదండ్రలు పిల్లలతో ప్రేమతో ఉంటే అన్ని విషయాలు చెప్పుకుంటారన్నారు. ఏదైనా సమస్య ఉంటే 1098కి కాల్ చేసి చెప్పాలని సూచించారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది మహేష్, తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేష్, ప్రిన్సిపాల్ సరిత, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.