బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలి
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:35 AM
జిల్లాలోని 14,15 ఏళ్ల బాలికలకు తప్పకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 14,15 ఏళ్ల బాలికలకు తప్పకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర ప్రధాన వైద్యశాల ఆవరణలో గర్భాశయ క్యాన్సర్ నివారించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథి కలెక్టర్ ప్రారంభించారు. వైద్యులు 14, 15 ఏళ్లలోపున్న బాలికలకు వ్యాక్సిన్ వేశారు. అనంతరం బాలికలకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గర్భా శయ క్యానర్సర్ నివారించేదుకు 14 నుంచి 15 సంవత్సరాలలోపున్న బాలికలకు తల్లిదండ్రులు బాధ్యత వహించి హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలన్నారు. జిల్లాలో మొత్తం 3773 మంది 14 నుంచి 15 సంవత్సరాలలోపున్న బాలికలను గుర్తించామన్నారు. బాలికల తల్లిదండ్రులు గుర్తింపు కార్డులతో వచ్చి వ్యాక్సిన్ వేయించాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ ప్రధాన వైద్యశాలలు, ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెట్టామన్నారు. అనంత రం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన వైద్యశాల ఆవ రణలో కలెక్టర్ గరిమా అగ్రవాల్ కేక్ కట్‌చేసి స్వీట్లను పంపిణీ చేసి ఆసుపత్రి మహిళా వైద్యులు, సిబ్బంది. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, డీఎంహెచ్‌వో డాక్టర్ రజి త, సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ కమీషనర్ ఎండీ ఖదీర్‌పాషా, జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.