బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:51 PM
బాలికలు అన్ని రంగాల్లో ముందు ఉండడంతోపాటు చదువుల్లో రాణించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరా రు.
సిరిసిల్ల రూరల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): బాలికలు అన్ని రంగాల్లో ముందు ఉండడంతోపాటు చదువుల్లో రాణించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరా రు. బాలవివాహ ముక్త్‌భారత్‌లో భాగంగా సిరిసిల్లఅర్భన్ పరిధిలోని చంద్రంపే ట జిల్లా పరిషత్ ఉన్నతా పాఠశాలలో మంగళవారం జిల్లా మహిళా శిశుసంక్షే మ శాఖ సాధికారిత కేంద్రం అధ్వర్యంలో విద్యార్థులకు అవగహన కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమా ధికారి లక్ష్మీరాజం మాట్లాడారు. బాలికల విద్యకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. బాలి కల రక్షణ కోసం షీటీంలు, యంగ్ ఇండియా స్కూల్స్, గృహజ్యోతి ఉచిత విద్యు త్తు, ఉచిత సిలిండర్, ఉచిత బస్సు రవాణా సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక పథకాలను మహిళల పేర్లమీద ఇస్తున్నారని వివరించారు. బాలికలు చదువుకుని ఉన్నత లక్ష్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా బాలికలకు పలు రకాలైన చట్టాలు మహిళల కోసం ప్రత్యేకించబడిన చట్టాలు వాటిని ఎలా అమలు చేస్తారనే వియాల గురించి వివరించారు. అలాగే బాలికల కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను గురించి అవగాహన కల్పిం చారు. ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించుకోవడానికి ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా పాఠశాల ప్రధానోపాధ్యాయు లు ఎన్జీవో సంస్థల ప్రతినిధులు తదితరులుయపాల్గొన్నారు.