పాఠ్యపుస్తకాల్లో జార్జిరెడ్డి జీవిత చరిత్రను ముద్రించాలి
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:51 AM
ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నేత, ఉస్మానియా అరుణతార, పీడీఎస్ యూ వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్వి కుతాటి రాణాప్రతాప్ అన్నారు.
వేములవాడ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నేత, ఉస్మానియా అరుణతార, పీడీఎస్ యూ వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్వి కుతాటి రాణాప్రతాప్ అన్నారు. జార్జిరెడ్డి వర్ధంతిని వేములవాడ పట్టణంలోని పోస్ట్మాటిక్ హాస్టల్ ఆవరణలో పీడీఎస్‌యూ విద్యార్థి సం ఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాణా ప్రతాప్ మాట్లాడుతూ నరేం ద్రమోదీ పాలనలో దేశంలో రోజురోజుకు కుల, మతోన్మా ద ఫాసిజం పెట్రేగిపోతుందని, పౌరుల ప్రజాస్వామిక హక్కులను ప్రశ్నించే గొంతులను నిరంకుశంగా అణచి వేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులంతా శాస్ర్తీయ దృక్పథాన్ని అలవరుకొని ప్రగతిశీల భావజాల వ్యాప్తికి కృషి చేయాలన్నారు. శాస్ర్తీయ విద్య, సమానత్వ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో ని పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన సమాన విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవ కాశాల కోసం విద్యార్థి ఉద్య మాలను ఉధృతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్య ను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేషన్ విద్యకు వత్తాసు పలుకుతున్నారని, విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తివేసే కుట్రను ప్రభుత్వం చేస్తుందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీనిపై విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శివ, అరవింద్, రాకేష్, ప్రణయ్ తదితరులు ఉన్నారు.