సార్వత్రిక సమ్మె సక్సెస్
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:38 PM
జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యలో యూనివర్సిటీ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
భగత్‌నగర్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యలో యూనివర్సిటీ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్, పట్టణ లారీ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, రైల్వే హమాలీ యూనియన్, బీఆర్టీయూ, టీయూసీఐ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొన్నది.
ఫ లేబర్ కోడ్‌లను రద్దు చేసేంత వకు పోరాటం ఆగదు
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ
కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన లేబర్ కోడ్‌లు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ అన్నారు. గురువారం సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ఆల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో బారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడులూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లు, వీబీ జీరామ్‌జీ చట్టం, విద్యుత్, విత్తన బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్నయాదవ్, జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి జిందం ప్రసాద్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆల్ ట్రేడ్ యూనియన్‌ల ఆద్వర్యంలో తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బ్యానర్లు చేతపట్టుకుని నినాదాలు చేస్తు నాయకులతో పాటు, కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు.