Share News

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:57 AM

జిల్లా పరిధి లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్‌ సెంటర్‌లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవా లను అత్యధిక చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదే శించారు.

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

సిరిసిల్ల అర్బన్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పరిధి లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్‌ సెంటర్‌లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవా లను అత్యధిక చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదే శించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో గురువారం లింగ నిర్ధారణ పరీక్షల కేంద్రాలు, ఆసుపత్రులకు అనుమతులు జారీ, నవజాత శిశు మరణాలపై వైద్య ఆరోగ్యశాఖ, సంక్షేమ శాఖ, పోలీస్‌ శాఖ, అగ్నిమాపక శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాల పని తీరుపై నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. భ్రూణ హత్యలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీసీఎన్‌బీ యాక్ట్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా అడ్వైజర్‌ కమిటీ సమావే శాలు నిర్వహించాలని సూచించారు. భ్రూణ హత్యలతో మగ, ఆడపిల్లల లింగ నిష్పత్తిపై ప్రభావం చూపుతుందన్నారు. ఆడ అయినా.. మగ అయినా ఒకటేనని, ఇద్దరూ సమానమేనని స్పష్టం చేశారు. దీనిపై వైద్య ఆరోగ్య, జిల్లా సంక్షేమ శాఖ అధి కారులు ప్రజలందరికి అవగాహన కల్పించాలని సూచించారు. స్కానింగ్‌ కేంద్రాల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిబం ధనలు అతిక్రమించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. లింగ నిర్దారణ పరీక్షలు చేస్తే పరి ణామాలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా లోని అన్ని పైవ్రేటు ఆసుపత్రుల రేడియాలజిస్ట్‌లు, ల్యాబ్‌ టెక్నిషియన్‌లతో నిత్యం సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో నూతన ఆసుపత్రుల ఏర్పాటుకు రిజి౉ స్ట్రషన్‌ ప్రక్రియ నిబంధనల ప్రకారం చేయాలని, ఆయా ఆసుపత్రులకు మున్సిపల్‌, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అన్ని అనుమతులు ఉన్న వాటికి నిబంధనల ప్రకారం అనుమతు లు మంజూరు జారీ చేయాలని సూచించారు.

నవజాత శిశు మరణాల జరగకుండా చర్యలు

జిల్లాలో నవజాత మరణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. జిల్లాలో గత నాలుగు నెలల్లో జరిగిన నవజాత శిశువుల మర ణాలపై సమీక్ష చేశారు. ఆయా శిశువుల తల్లి ఆరోగ్య పరిస్థితి, ఇంతకుముందు ఎందరు పిల్లలు ఉన్నారు. నవజాత శిశువుల మరణానికి కారణాలపై వివరాలు సేకరించారు. పిల్లల జననా ల మధ్య ఖచ్చితంగా నిర్ణీత సమయం ఉండాలని, దీంతో తల్లి, పుట్టబోయే బిడ్డకు ఎంతో మేలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. నవజాత పిల్లల సంర క్షణ, పాలు పట్టించడం, మిగతా అంశాలపై బాలింతలు, కుటుంబ సభ్యులకు వివరించాలని కోరారు.

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలపై ప్రజలకు విస్తృత అవగా హన కల్పించాలని, అత్యధికంగా ప్రసవాలు జరిగేలా తీసుకో వాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అత్యవసర మైన పక్షంలోనే సీ సెక్షన్‌ ఆపరేషన్లు చేయాలని అదేశించారు. గర్భిణులపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. గర్భిణు లు, బాలింతలు, నవజాత శిశువుల మరణాలు జిల్లాలో జరగ కూడదని పేర్కొన్నారు. ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, డాక్టర్లు, ఆశ కార్య కర్తలు నిత్యం గర్భిణులతో మాట్లాడాలని వారి కుటుంబ ఆరోగ్య చరిత్ర ఇతర వివరాలు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రజిత, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీందర్‌, డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా అగ్నిమాపక శాఖాధి కారి శ్రీనివాసరెడ్డి, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్‌ శోభారాణి, ఎన్జీవో ప్రతినిధి భాస్కర్‌, ఆయా మండలాల వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:57 AM