Share News

వన మహోత్సవానికి సన్నద్ధం

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:16 AM

వన మహోత్సవానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.

వన మహోత్సవానికి సన్నద్ధం

కరీంనగర్‌ రూరల్‌, జూలై 1 (ఆంద్రజ్యోతి): వన మహోత్సవానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలో 14 గ్రామ పంచాయతీల్లో 14 నర్సరీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు పెంచుతున్నారు. 1,04,500 మొక్కలు ఆయా నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. మండలంలో 14 గ్రామ పంచాయతీల్లో 70 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటింటికి ఆరుమొక్కలను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 40వేల మొక్కలను రెవెన్యూ కమిటీ, చెరువు కట్టలు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లకు ఇరువైపుల, కెనాల్‌ కట్టపై నాటించేందుకు గుంతలను తీయించారు. ఇళ్లలో పంపిణీ చేసేందుకు మందారం, గులాబి, బొప్పాయి, నిమ్మ, జామ, ఉసరి, కరివేపాకు చెట్లు అందుబాటులో ఉన్నట్లు ఏపీఓ శోభరాణి తెలిపారు.

Updated Date - Jul 02 , 2026 | 12:16 AM