కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్యాస్ కొరత
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:14 AM
కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గ్యాస్ ధర పెంపు, కొరతకు నిరసనగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద సీపీఐ నేతలు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
గణేష్‌నగర్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గ్యాస్ ధర పెంపు, కొరతకు నిరసనగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద సీపీఐ నేతలు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతలా వ్యవహరిస్తున్నాడన్నారు. ఇంతా జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. యుద్ధం కారణంగా గ్యాస్ దొరకని స్థితి నెలకొందని, గృహావసరాలకు 45 రోజులకు గాని సిలిండర్ రావడం లేదన్నారు. హోటళ్లు, ఇతర వాణిజ్య వ్యాపార వర్గాలకు సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. సిలిండర్లు ఎత్తుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్, న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, మచ్చ రమేష్, కొట్టే అంజలి, తెరాల సత్యనారాయణ పాల్గొన్నారు