Share News

ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్యాస్‌ నిల్వలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:18 AM

జిల్లాలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా గ్యాస్‌ సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయని ఎక్కడ సిలిండర్‌ల కొరత లేదని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్యాస్‌ నిల్వలు

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా గ్యాస్‌ సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయని ఎక్కడ సిలిండర్‌ల కొరత లేదని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్ట రేట్‌ శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోవాలని కోరారు. గ్యాస్‌ సిలిండర్‌లు పక్కదారి పట్టినా, బ్లాక్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరా విష యమై జిల్లాలో కంట్రోల్‌ రూంను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కంట్రోల్‌ రూం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్‌కు సంబంధించి సమస్యలు ఎదురైతే వినియోగదారులు 8008429738 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించి తమ ఫిర్యాదులను చేయాలని కోరారు. ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరా, పంపిణీకి సంబంధించి సమస్యలను పర్యవేక్షించడంతోపాటు వినియోగదా రుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించారు. కంట్రోల్‌ రూంలో నమోదు అయ్యే ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీలకు తెలియజేసి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Mar 28 , 2026 | 12:18 AM