హైవే పక్కనే చెత్త డంపింగ్
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:22 AM
కరీంనగర్-వరంగల్-563 జాతీయ రహదారి పక్కన హుజూరాబాద్ సమీపంలో డంపింగ్ యార్డు నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది.
హుజూరాబాద్ రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్-వరంగల్-563 జాతీయ రహదారి పక్కన హుజూరాబాద్ సమీపంలో డంపింగ్ యార్డు నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని సిర్సపల్లి గ్రామ శివారులో హుజూరాబాద్ పట్టణంలోని 30 వార్డులకు చెందిన చెత్తను డంప్ చేస్తున్నారు. చెత్తను నేరుగా జాతీయ రహదారికి అనుకొని డంప్ చేస్తుండడంతో తీవ్రమైన దుర్వాసన వస్తోంది. కోట్లాది రూపాయలతో నిర్మించిన కొత్త బైపాస్‌కు అనుకొని ఇలా చెత్తను డంప్‌ను చేస్తున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం వేళ చెత్తను తగలబెడుతుండడంతో పొగ విపరీతంగా వ్యాపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఫ కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోని మున్సిపల్ అధికారులు...
కొత్త బైపాస్‌ను ఆనుకొని చెత్తను డంప్ చేయడంపై ఎన్‌హెచ్‌ఐ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలెక్టర్ చిత్రమిశ్రా దృష్టికి తీసుకెళ్లారు. ఆగస్టు 27న కలెక్టర్ డంపింగ్ అవుతున్న చెత్త ప్రదేశాన్ని పరిశీలించారు. జాతీయ రహదారికి దూరంగా చెత్తను డంప్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో చెత్తను రహదారికి సమీపంలో డంప్ చేయకుండా మున్సిపల్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశించినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా చెత్తను డంప్ చేస్తున్నారు.