Share News

శాంతియుతంగా గణేష్‌ నవరాత్రి వేడుకలు

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:32 AM

గణేష్‌ నవ రాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావర ణంలో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్‌ శాఖకు సహకరించాలని ఎస్పీ మహేష్‌ బీ గితే సూచించారు.

శాంతియుతంగా గణేష్‌ నవరాత్రి వేడుకలు

సిరిసిల్ల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నవ రాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావర ణంలో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్‌ శాఖకు సహకరించాలని ఎస్పీ మహేష్‌ బీ గితే సూచించారు. మంగళవారం సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్‌ హాల్లో గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపా ల నిర్వహకులు స్థానిక కౌన్సిలర్లతో సమన్యయం సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ గత ఏడాది నిమజ్జనం సందర్భంగా జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించారని, జిల్లాలో అక్కడక్కడా ఇబ్బందులకు పాల్పడిన వారిపై 8 కేసులు నమోదు చేశామని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పక డ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లాలో ప్రతి గణేష్‌ మండపాల నిర్వాహకులు గణేష్‌ పోర్టల్‌-2026లో తమ మండపానికి సంబంధించిన వివరాలను తప్పనిస రిగా నమోదు చేసుకోవాలని, ప్రజా రవాణాకు, అత్యవ సర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగ కుండా గణేష్‌ మండపాలను ఏర్పాటు చేసుకోవాల న్నారు. ప్రతి మండపం వద్ద వలంటీర్లు 24-7 అందుబా టులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని, మండపం వద్ద జరిగే అన్ని కార్యక్రమాలకు పూర్తి బాధ్యత మండప నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, మండ పాలన్నింటినీ జియో ట్యాగింగ్‌ చేయనున్నట్లు తెలిపా రు. గణేష్‌ విగ్రహల ఆగమనం సమయంలో 10 అడు గుల కంటే ఎక్కువ ఎత్తు ఉంటే ముందుగానే పోలీస్‌ శాఖకు ముందస్తు సమాచారం అందించాలని సూచిం చారు. నిమజ్జనం రోజున మండపం నుంచి నేరుగా నిర్దే శించిన నిమజ్జన ప్రదేశానికి వెళ్లాలని, నిర్ధేశించిన సమ యానికి నిమాజ్జనం చేయాలన్నారు. సిరిసిల్ల మానేరు తీరంలో ఏర్పాటు చేయనున్న నిమజ్జన ప్రదేశంలో భక్తు లకు ఇబ్బందులు కలగకుండా సరిపడా క్రేన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.నిబంధనలకు లోబడి ఉత్సవా లను నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని, మండపాలను పోలీ స్‌ అధికారులు, బ్లూకోల్ట్‌ సిబ్బంది తరచూ సందర్శించి పరిస్థితులను పర్యవేక్షిస్తారని, మండపాల వద్ద మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు వంటి చర్యల కు పాల్పడే వారిపై, అలాగే వాటిని నియంత్రించడంలో నిర్లక్ష్యం వహించే మండప నిర్వాహకులపై కూడా కేసు లు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గణేష్‌ నవరా త్రి వేడుకల సందర్భంగా మండపాల వద్ద, శోభాయాత్ర, నిమజ్జనం రోజున డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజేలను వినియోగిస్తే డీజే నిర్వా హకులతో పాటు సంబంధిత మం డప నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించా రు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాత్రి 10గంటల వర కు మాత్రమే రెండు చిన్న స్పీకర్లను వినియోగించాలని సూచించారు. గ ణేష్‌ ఉత్సవాల్లో సోషల్‌ మీడియా లో వచ్చే పోస్టులపై జిల్లా పోలీస్‌ శాఖ ప్రత్యేక నిఘా ఏరాఁటు చేస్తుందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు చేసే వారిపై, అలాగే వాస్తవాలను తెలుసుకోకుండా అలాంటి పోస్టులను ఫార్వర్డ్‌ చేసే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. సమావేశంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీని వాస్‌, నాగేశ్వరరావు, వెంకటేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 12:32 AM