Share News

వైభవంగా గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:00 AM

గణేష్‌ నవరాతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

వైభవంగా గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : గణేష్‌ నవరాతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం గణేష్‌ నవరాతి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పా ట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ఇతర అంశాలపై ఎస్పీ మహేష్‌ బీ గీతేతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్‌, సెస్‌, మత్స్య, పోలీస్‌, రవాణా శాఖ, ఆర్‌అండ్‌బీ, నీటి పారుదల, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై కలెక్టర్‌ చర్చించారు. నవరాత్రి ఉత్సవాల నుంచి నిమ జ్జనం వరకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించాలని, క్షేత్రస్థాయిలో పరిశీ లించాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలోని అన్ని గణేష్‌ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా వివరాలను పోలీస్‌ శాఖ వెబ్‌సైట్‌లో నమో దు చేయాలని ఎస్పీ మహేష్‌బీగీతే సూచించారు. నిమజ్జనం రోజున నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కోరారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, ఆర్డీవోలు శ్రీధర్‌ బాబు, కేఎస్‌బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రాచారి, శ్రీనివాసులు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌, జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారి హిమశ్రీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌, పంచాయతీరాజ్‌ ఈఈ సుదర్శన్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్‌, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టివినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి సంబంఽధించిన పోస్టర్‌ లను ఎస్పీ మహేష్‌ బీ గీతేతో కలిసి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కలెక్టరేట్‌ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్‌ నవ రాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏఈఈ శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

హెల్త్‌సబ్‌ సెంటర్ల పనులు వేగంగా పూర్తి

జిల్లాలో సబ్‌హెల్త్‌ సెంటర్‌లలో పనులు వేగం పెంచి అన్ని మౌలిక వసతులను కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను అదేశించారు. కలెక్టర్‌లో గురువారం పంచాయ తీరాజ్‌, టీజీఎంఎస్‌ అధికారులతో ఎన్‌హెచ్‌ఎం, 15 ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న హెల్త్‌ సబ్‌సెంటర్‌ల భవన నిర్మాణాల పనులపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడు తూ తుది దశలో ఉన్న సబ్‌హెల్త్‌ సెంటర్‌ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్‌, జిల్లా వైద్యా ధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 01:00 AM