Share News

ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నిమజ్జనం

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:41 AM

సిరిసిల్ల సబ్‌ డివిజన్‌ పరిధిలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా నిర్వాహకులతో పాటు ఉత్సవ సమితి సభ్యులు ఏర్పాట్లు చేపట్టాలని సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, డీఎస్పీ నాగేంద్రచారీలు కోరారు.

ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నిమజ్జనం

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల సబ్‌ డివిజన్‌ పరిధిలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా నిర్వాహకులతో పాటు ఉత్సవ సమితి సభ్యులు ఏర్పాట్లు చేపట్టాలని సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, డీఎస్పీ నాగేంద్రచారీలు కోరారు. సిరిసిల్ల పట్టణంలో లహరి ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేపట్టా ల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు తదితర అంశాలపై సిరిసిల్ల సబ్‌ డివిజన్‌లోని వివిధ శాఖల అధికారులు, గణేష్‌ మండ పాల నిర్వాహకులు, పీస్‌ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లా డుతూ పోలీసుల సూచనలు, సలహాలను పాటిస్తూ గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకో వాలని కోరారు. ఉత్సవ నిర్వాహకులు పోలీస్‌ శాఖకు సహకరించి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిం చాలని సూచించారు. సిరిసిల్ల మానేరు తీరంలో ఏర్పాటు చేయనున్న నిమజ్జన ప్రదేశంతో పాటుగా మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖల సమన్యయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్‌కి సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచిం చారు. నిమజ్జన ప్రదేశాల్లో 24గంటలూ అంబులెన్సులు, అవసరమైన మందులు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లతో పాటు అత్యవసర వైద్య సేవలందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు శ్రీనివాస్‌,నాగేశ్వరరావు, వెంకటేష్‌, ఫైర్‌, వైద్య, విద్యుత్‌ శాఖ అధికారులు, ఎస్‌ఐలు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 12:41 AM