మౌలిక సదుపాయాలతో మరింత అభివృద్ధి
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:14 AM
జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్‌లో మౌళిక సదుపాయాలతో మరింత అభివృద్ధి చేస్తామని తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అదనపు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్‌కుమార్ జైన్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్‌లో మౌళిక సదుపాయాలతో మరింత అభివృద్ధి చేస్తామని తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అదనపు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్‌కుమార్ జైన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 17వ పోలీస్ బెటాలియన్‌లో నిర్మించిన ఫోర్ట్‌వాల్, నార్త్ ఈస్ట్ గేట్లు, యూ నిట్ జిమ్‌లను వర్చువల్‌గా ఏడీజీపీ సంజయ్‌కుమార్ జైన్ ప్రారంభిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమంతో పాటు వారి విధి నిర్వహణ సామార్థ్యాన్ని మరింత పెంపొందిస్తామని యూనిట్ జిమ్ ద్వారా పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉందని అన్నారు. 17వ బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేష్ సిబ్బంది సంక్షేమం, శిక్షణ కార్యక్రమాలు, ఫిట్‌నెస్ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ఏడీజీపీ సంజయ్‌కుమార్ జైన్‌కు వివరించారు. 17వ పోలీస్ బెటాలియన్‌లో ఫోర్ట్‌వాల్, నార్త్ ఈస్ట్ గేట్లు, యూనిట్ జిమ్‌లను ఏర్పాటు చేసినందుకు ఏడీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ బెటాలియన్ ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.