ధర్మశాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:33 AM
వేములవాడ శ్రీ రాజారాజజేశ్వర స్వామి దేవస్థా నంలోని టీటీడీ ధర్మశాల, కల్యాణ మండపం పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్ బండారి కృష్ణప్రియ రాజ్‌కుమార్ అన్నారు.
వేములవాడ రూరల్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీ రాజారాజజేశ్వర స్వామి దేవస్థా నంలోని టీటీడీ ధర్మశాల, కల్యాణ మండపం పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్ బండారి కృష్ణప్రియ రాజ్‌కుమార్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ టీటీడీ ఆలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్‌కు ఆది వారం వినతి పత్రం అందజే శారు. వేములవాడలోని టీటీడీ ధర్మశాల 60 ఏళ్ల క్రితం నిర్మించిందని, ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని వివరిం చారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చొరవ తో కొండగట్టు ఆలయ అభివృద్ధికి 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులు మంజూరయ్యాయని, అదే తరహాలో వేము లవాడలోని టీటీడీ ధర్మశాలకు నిధులు కేటాయించాలని ఈ సందర్బంగా నేమూరి శంకర్‌గౌడ్‌కు విన్నవించగా వారు సానుకూలంగా స్పందించినట్లు బండారి కృష్ణప్రియ రాజ్‌కు మార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెంటల మహేష్, నేరెళ్ల నరేష్‌గౌడ్, కొలగాని చందు, ఎడ్ల నీరజ్, మహమ్మద్ చాంద్, ముడిశెట్టి రోహిత్, గాజుల భర త్ తదితరులు పాల్గొన్నారు.