Share News

సమానంగా నిధులు మంజూరు చేయాలి

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:32 AM

అన్ని గ్రామాలకు సమానంగా నిధులు మంజూరు చేయాలని, వివక్షత చూపితే ప్రజలు తిరగబడతారని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు.

సమానంగా నిధులు మంజూరు చేయాలి

ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : అన్ని గ్రామాలకు సమానంగా నిధులు మంజూరు చేయాలని, వివక్షత చూపితే ప్రజలు తిరగబడతారని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధిహామీ పథకం కింద మండలంలోని 24 గ్రామపంచాయతీలకే నిధులు కేటాయించి బీఆర్‌ఎస్‌ నాయకులు సర్పంచ్‌లుగా ఉన్న గ్రామాలను విస్మరించడం సరైన విధానం కాదన్నారు. ఈ 11గ్రామాల ప్రజల బాగోగులు ఎమ్మెల్యేకు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఉపాధిహామీ నిధులు ఏఒక్కరి జాగీరు కాదన్నారు. గ్రామాలకు నిధులు రావాలంటే కాంగ్రెస్‌పార్టీలో చేరాలని సర్పంచ్‌లపై ఒత్తిడి తేవడం చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అర్థం అవుతుందన్నారు. రెండున్నర సంవత్సరాల్లో మండలంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి 11 గ్రామాలకు నిధులు కేటాయించాలని, లేకుంటే కలెక్టర్‌ను కలిసి నిధులు మంజూరుచేయాలని కోరుతామన్నారు. గత బీఆర్‌ ఎస్‌ హయాంలో ఏనాడు ఇలా వివక్ష చూపలేదన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వెంట ఉన్న నాయకులు సంవత్సరంలోపు విడిచిపెట్టి పోతారని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీమాజీ వైస్‌చైర్మన్‌ సిద్దం వేణు, నాయకులు మరిజ మోహన్‌రావు,ఒగ్గు నర్సయ్యయాదవ్‌, వికృతి లక్ష్మారెడ్డి, రడం ప్రవీణ్‌, కముటం రాములు, సావనపెల్లి అనీల్‌కుమార్‌, రాగటి రమేష్‌, సాదుల్‌, ఆరె కొమురయ్య, తూటి పర్శరాం, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశం, పండుగ భాస్కర్‌, ఎడ్ల ప్రశాంత్‌రెడ్డి, కూనబోయిన రఘు, సత్యం, గడ్డం తిరుపతి, రాజారాం, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:32 AM