పవర్‌లూం పరిశ్రమల అభివృద్ధికి పూర్తి మద్దతు
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:33 PM
జిల్లాలోని వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో మద్దతు అందిస్తుందని ఎన్‌పీడీ సీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో మద్దతు అందిస్తుందని ఎన్‌పీడీ సీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఆదివా రం ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి పర్యటించి వస్త్ర పరిశ్రమల్లో మర మగ్గాల పనీతీరును పరిశీలించారు. ఈసందర్భంగా మరమగ్గాల పనితీరు, విద్యుత్ వినియోగ విదానం, ఉత్పత్తి ప్రక్రియలను పరిశీలించిన సీఎండీ పరిశ్రమలో అధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా విద్యుత్ ఆదా చేయడంతోపాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అవకాశాలపై అధికా రులతో చర్చించారు. తరువాత నేతన్నలతో ముఖాముఖి సమా వేశాన్ని నిర్వహించిన వరుణ్‌రెడ్డి వారి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేతన్నల సంక్షేమం కోసం కట్టు బడి ఉన్నామని పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన నిరం తర విద్యుత్ సరఫరాను అందించడం టీజీఎన్‌పీడీసీఎల్ బాధ్యతగా భావి స్తున్నామని స్పష్టం చేశారు. సిరిసిల్ల పవర్‌లూం పరిశ్రమ రాష్ట్ర ఆర్థికాభి వృద్ధిలో కీల క పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నేతన్నల జీవనోపాధి మెరుగుదలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో ఎస్‌ఈ భిక్షపతి, అధికారులతో పాటు చేనేత వస్త్ర వ్యా పార సం ఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, ఏనుగుల ఎల్లయ్య, చాప గణే ష్ తదితరులు పాల్గొన్నారు.