అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:49 AM
పిల్లల భవిష్యత్తుకు వెలు గులు నింపే అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కల్పించడంలో ఎన్‌పీడీసీఎల్ కీలక ప్రాత పోషిస్తోందని సిరిసిల్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ వేణుగోపాల్ అన్నారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : పిల్లల భవిష్యత్తుకు వెలు గులు నింపే అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కల్పించడంలో ఎన్‌పీడీసీఎల్ కీలక ప్రాత పోషిస్తోందని సిరిసిల్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ వేణుగోపాల్ అన్నారు. సిరిసిల్ల సర్కిల్ పరిధిలోని 1477 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను సర్వేలు చేసి విద్యుత్ కనెక్షన్‌లను జాగు పథ కం కింద ఉచితంగా అందిస్తామన్నారు. ఇందులో భాగంగా బుధవారం సిరిసిల్ల పట్టణంతోపాటు గంభీరావుపేట మండలంలోని పలు అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించి విద్యుత్ కనెక్షన్‌లను మంజూరు చేసి ఏర్పా టు చేయించామని తెలపారు. చిన్నారుల కోసం నిర్వహించే ప్రీ స్కూల్ కార్యకలాపాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య సేవలు సజావుగా సాగేందు కు విద్యుత్ సౌకర్యం ఎంతోగానో దోహదపడుతుందని అన్నారు. విద్యుత్ వెలుగులతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యానులు, లైట్లు, తాగునీటి మోటార్లు పరికరాలు సక్రమంగా పనిచేయడంతో పిల్లలకు సౌకర్యవంతమైన వాతా వరణంలో విద్యను అభ్యసించగలుతుంటారని ఎస్‌ఈ తెలిపారు. ఈ కార్య క్రమాల్లో డీఈఈ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.