రైతు భరోసా పేరుతో మోసం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:16 AM
ప్రజల ఓట్ల కోస మే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో మోసం చేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హామీలను అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఓట్ల కోస మే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో మోసం చేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హామీలను అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రగుడు జంక్షన్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీ కలె క్టరేట్‌లోకి పోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేట్ వద్దనే బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం కలె క్టరేట్‌లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో గోపి మాట్లాడు తూ రైతుల పెట్టుబడుల కోసం అందించాల్సిన రైతు భరోసాను ఎన్ని కల కోసం మాత్రమే అందిస్తూ ఈ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తన అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చి రెండున్నర సంవ త్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు చేయకుం డా ప్రజలను మోసం చేస్తోందన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యార్థి భృతి, నిరుద్యోగ భృతిలకు హామీలను ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇంకా అందడం లేదన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు భరోసా కూడా ఎన్నికల సమయంలో మా త్రమే గుర్తుకు వస్తుందన్నారు. మహిళలకు ప్రకటించిన కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి పథకాల అమలు ఎక్కడుందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చి ప్రభుత్వంపై పోరా టం చేస్తామన్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రం మహే ష్, కుమ్మరి శంకర్, కరీంనగర్ పార్లమెంటరీ కో-కన్వీనర్ అడెపు రవీం దర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బర్కం వెంకటలక్ష్మీ, కౌన్సిలర్‌లు కొండ వర్షిణినరేష్, ఊర గొండలక్ష్మీరాజు, మావిడాల మహేష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.