Share News

మానాలలో రూ.14.20 కోట్లతో రహదారులకు శంకుస్థాపన

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:03 AM

రుద్రంగి మండలంలోని ఉమ్మడి మానాల గ్రామంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, నిజామా బాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.

మానాలలో రూ.14.20 కోట్లతో రహదారులకు శంకుస్థాపన

రుద్రంగి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : రుద్రంగి మండలంలోని ఉమ్మడి మానాల గ్రామంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, నిజామా బాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం మానాలలో మాజీ నిజామాబా ద్‌ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డితో కలిసి మొత్తం రూ.14.20 కోట్ల వ్యయంతో చేప ట్టనున్న మూడు రహదారి పనులకు శంకుస్థా పన చేశారు. మరిమడ్ల రహదారి నిర్మాణానికి రూ.7.43 కోట్లు, మానాల రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేం దుకు రూ.5.60 కోట్లు, హనుమాన్‌ తండా (గొర్రెగుండం) రహదారి నిర్మాణానికి రూ.1.17 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కలిగోట సూరమ్మ చెరువు పనులు తుది దశ కు చేరుకున్నాయని, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ సూచనల మేరకు ఆ జలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా మానాలకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుం టామని సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నిజా మాబాద్‌రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లా డుతూ.. మానాల గ్రామానికి ఉద్యమాల చరి త్ర ఉందని, ప్రజా పాలనలో ప్రభుత్వం అమ లుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివ రించారు. తనకు ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కోఆపరే టివ్‌ యూనియన్‌ మానాల మోహన్‌రెడ్డి మా ట్లాడుతూ మానాల గ్రామం తనకు ఇంటిపేరు గా మారిందని, గ్రామ ప్రజలు చూపిన ఆదరా భిమానాలతోనే తాను ఉన్నత స్థాయికి ఎదిగా నని భావోద్వేగానికి గురయ్యారు. గిరిజనులకు పోడు పట్టాలు, పట్టాల పునరుద్ధరణతో పాటు సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించా లని కోరారు. సూరమ్మ చెరువు నుంచి ఎత్తిపో తల ద్వారా మానాలకు నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి మానాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ చార్జి అనిల్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హైమద్‌, తహసీల్దార్‌ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్‌, మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ చేలకల తిరుపతి, చందుర్తి సీఐ రవీందర్‌, ఎస్సై మోతీరామ్‌ నాయక్‌, రిటైర్డ్‌ ఏడీఈ భూక్య లక్ష్మణ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి తూమ్‌ జలపతి, మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి, పలువురు సర్పంచులు, నాయకులు, వార్డుసభ్యులు, మహిళలు, యువకులు, గ్రామ స్తులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:03 AM