క్రీడలతో స్నేహభావం పెంపు
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:20 AM
క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు స్నేహభావం పెంపొందుతుందని సిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
సిరిసిల్ల రూరల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు స్నేహభావం పెంపొందుతుందని సిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలయన్‌లో వార్షిక క్రీడా పోటీలు మూడురోజులుగా కొనసాగుతున్నాయి. ఈ క్రీడ పోటీల్ల్లో పరుగు పందెంతో పాటు క్రికెట్, వాలీబాల్, షెటిల్, క్యారం, చెస్ పోటీలను నిర్వహించారు. ముగింపు పోటీల ను శుక్రవారం నిర్వహించగా కార్యక్రమానికి ఇన్‌చార్జి కలెక్టర్ హాజరై మాట్లాడారు. అనంతరం పరుగు పందెలతో పాటు టగ్ ఆఫ్‌వార్ పోటీలను బెటాలియన్ కమాండెం ట్ ఎంఐ సురేష్‌తో కలిసి ప్రారంభించారు. వంద మీటర్ల పరుగు పందెంలో మొదటి బహుమతి తిరుపతి, రెండో బహుమతి శ్రీహరి, మూడో బహుమతి సురేష్‌లు గెలుపొందారు. టగ్ ఆఫ్ వార్ పోటీల్లో బెటాలియన్ పోలీస్ కంపెనీ ఏ జట్టు, ఎస్డీఆర్‌ఎఫ్ జట్లు రెండు రౌండ్లలో హో రాహోరీగా తలప డ్డాయి. రెండు రౌండ్ల లో ఎస్డీఆర్‌ఎఫ్ జట్టు విజయం సాధించిం ది. ఈ విజేతలకు బెటాలియన్ కమాండెంట్ సురేష్‌తో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ బహుమతులు అందజేసి, అభినం దించారు. అనంతరం జరిగిన సమావేఽశంలో ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడారు. క్రీడాపోటీలు రోజువారి ఒత్తిడిని దూరం చేస్తాయని, ఉద్యోగుల అందరి మధ్య స్నేహభావం, జట్టు గా ఎలా గెలుపు సాధించాలనే విషయాలకు దోహదపడుతాయన్నారు తానూ 2019 పంవత్సరంలో ఐపీఎస్‌గా ఎంపికై శిక్షణ తీసు కున్నానని, ఇక్కడ ఉన్న వారిని చూస్తే తానూ నేర్చుకున్న పోలీస్ శిక్షణ మొత్తం గుర్తుకువస్తుందని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్‌లు రాందాస్, సురేష్, ఆర్‌ఐలు కుమారస్వామి, శ్రీనివాస్,శ్యాంరావు ఉన్నారు.