మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆశయ సాధన కృషి..
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:15 AM
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ఆశయ సాధనలో కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ కోరారు.
సిరిసిల్ల రూరల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ఆశయ సాధనలో కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ కోరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం అటల్ సుప రిపాలన సమ్మేళనం కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన జయశ్రీ మాట్లాడుతూ దేశంలోనే అటల్ బీహారీ గొప్ప రాజ కీయ నాయకుడన్నారు. అయన దేశానికి ప్రధాన మంత్రిగా పని చేసిన సమయంలో దేశ ఆర్థిక సంస్కరణలు, విదేశీ విధానంలో గణనీయమైన మార్పులు చేశారన్నారు. ఆయన పాలన స్ఫూర్తి తోనే దేశంలో మూడవసారీ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేం ద్రమోదీ పాలన ముందుకు సాగుతోందని గుర్తుచేశారు. అటల్ బీహారీ వాజ్‌పేయి ఆశయాలను ప్రతి ఒక్కకి తెలిపాలన్నారు. జరుగబోయే స్థానిక సంస్థలు, మున్సిపాల్టీల ఎన్నికల్లో బీజేపీ చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు బడుగు బలహీన వర్గాల అభ్యన్నతి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలందరికి వివరించాలన్నారు. జరుగబోయే ఎన్నికల్లో బీజేపీ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థలందరిని గెలిపించుకునేం దుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటరీ కో-కన్వీనర్ అడెపు రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మ్యాన రాంప్రసా ద్, కోల కృష్ణస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, లింగం పల్లి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపా ధ్యక్షులు శీలంరాజు, మల్లారపు సంతోష్‌రెడ్డి, బండ మల్లేశం, బర్కం వెంకటలక్ష్మీ, వెంకటేశ్వర్‌రావు, కౌడిపల్లి గోపాల్‌రెడ్డి, రేగుల మల్లికార్జున్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.