ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి
ABN , Publish Date - May 22 , 2026 | 12:28 AM
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల, మే 21 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్య క్షుడు సంగీతం శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వనిత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగుల జగన్, వెంకటరమణ, జగన్, మధు, దామోదర్, శ్రీశైలం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
వేములవాడ : వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ వర్ధంతిని నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పుల్కం రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, కౌన్సిలర్ తూం మధు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్ ఐల శ్రీనివాస్ నాయకులు సంద్రగిరి శ్రీనివాస్, పీర్‌మహ్మద్, అంబటి చంద్రశేఖర్, దుర్గం పర్శరాములు, నాగుల విష్ణు, దండుగుల తిరుపతి, పల్లపు రాజేందర్ తదితరులు ఉన్నారు.
బోయినపల్లి : బోయినపల్లి మండలం తడగొండలో మాజీ ప్రధాని రాజీ వ్‌గాంధీ వర్ధంతిని నిర్వహించారు. అనంతరం ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ, పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్మనబో యిన సువీన్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్‌యాదవ్, వైస్‌చైర్మన్ నిమ్మ వినోద్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, సర్పంచులు ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్, నల్ల మోహన్, జంగం అంజయ్య, డైరెక్టర్ బొంగోని వెంక టేష్, అద్దంకి రమేష్, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రుద్రంగి : మండల కేంద్రంలో రాజీవ్‌గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ గండి నారాయణ, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, తర్రె మనోహ ర్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, కెసిరెడ్డి నర్సారెడ్డి, తర్రె లింగం, ఎర్రం అరవింద్, గుగ్గిళ్ల వేంకటేశం, గంధం మనోజ్, దయ్యాల శ్రీనివాస్, ద్యావాల రవి, దాసు, చెలుకల శ్రీకాంత్, పూదరి ప్రశాంత్, పూన్నురి శ్రీను, సత్యం, తదిత రులు పాల్గోన్నారు.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో రాజీవ్‌గాంధీ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమం లో ఏఎంసీ చైర్మపర్సన్ సబేరాబేగం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షు డు నర్సయ్య, నాయకులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, గౌస్, రాంరెడ్డి, బాపురెడ్డి, లక్ష్మారెడ్డి, గోపాల్, సాహెబ్, దత్తాద్రిగౌడ్, బాబు, రాములు, బుచ్చాగౌడ్, పద్మారెడ్డి, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి : మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని గురువారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు జల్గం ప్రవీణ్, నాయకులు నేరెళ్ల నర్సింగంగౌడ్, లింగాల భూప తి, మచ్చ శ్రీనివాస్, సుద్దాల శ్రీనివాస్, కొత్త రవీందర్, గుగ్గిళ్ల శ్రీకాంత్‌గౌడ్, ఆరెపల్లి బాలు, కట్కం రాజశేఖర్, పెద్దూరి తిరుపతి, మచ్చ ఆనందం, ఎగు ర్ల ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
చందుర్తి : రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొట్టె ప్రభాకర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. మాజీ జడ్పీటీసీ నాగం కుమార్, నాయకులు చింతపంటి రామస్వామి, బొజ్జ మల్లేశం, ఇందూరి మధు, శేఖర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కోనరావుపేట : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువా రం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఎస్‌ఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, మండల అధ్యక్షుడు మానుక సత్యం, చేపూరి గంగాధర్, బండ నర్సయ్య, నాలుక సత్యం, గొట్టే రుక్మిణి, పన్నాల లక్ష్మారెడ్డి, పల్లె రవీందర్ రెడ్డి, కాశీరాం, బుర్ర రవీందర్, వెలిచాల శ్రీనివాస్, లింబయ్య, బాదినేని బాలరాజు, ఉప్పుల గంగయ్య పాల్గొన్నారు.
ముస్తాబాద్ : భారత మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు కొండం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గజ్జెల రాజు, గుండెల్లి శ్రీనివాస్, కిషన్‌రావు, గాంత రాజు, పుల్లూరి రవి,షాదుల్‌పాప, రాంరెడ్డి, మామిండ్ల అంజనేయులు, మిరుదొడ్డి భాను, రంజాని నరేశ్, అరుట్ల మహేశ్‌రెడ్డి, బాబు, శీల ప్రశాంత్ తదిత రులు పాల్గొన్నారు.
గంభీరావుపేట : మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధం తిని గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ ఆస్ప త్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్, నాయకులు పర్శ హన్మండ్లు, ఓరుగంటి నర్సింలు, గంగి స్వామి, రామచం ద్రరెడ్డి, కోట లింగం, ఆజం, ప్రభాకర్, రాజనర్సు, భాస్కర్, అక్కపల్లి రాజ నర్సింహారెడ్డి, లచ్చయ్య, బాలయ్య, మల్యాల రాజవీర్, ప్రవీణ్ ఉన్నారు.