జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:53 PM
బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరా మారావు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు శుభకార్యాలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సిరిసిల్ల, నవంబరు 22 (ఆంరఽధజ్యోతి): బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరా మారావు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు శుభకార్యాలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల లో శాంతినగర్‌లో బీఆర్‌ఎస్ నాయకుడు బాలరాజు కొడుకు వివాహ రిసెప్షన్ సందర్భంగా దంపతులను ఆశీర్వదించారు. అంతకుముందు సిరిసిల్లకు చెందిన వార్డు అధ్యక్షుడు గోపాల్ కూతురు వివాహం సిద్ధిపేట లో జరుగగా దంపతులను ఆశీర్వదించారు.సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, వేములవాడ అగ్రహారంలో పలు కార్యక్ర మాలు పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటన సందడిగా సాగింది. ఆయన వెంట బీఆర్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజనాలకు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యారు. వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయ ఆవరణలో కార్తీక వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వీచ్చేసిన కేటీఆర్‌కు ఆర్యవైశ్య మిత్ర మండలి రాష్ట్ర, జిల్లా అధ్య క్షులు, పాలకవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంజన్న ఆలయ అర్చకులు వేద ఆశీర్వచ నం అందించారు. కార్తీక వనభోజనాలకు హజరైన కేటీ ఆర్ బ్రహ్మాణులకు కార్తీక దీపాలను ధానం చేశారు. వారి వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు ఉన్నారు.
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం ముస్తా ఫనగర్‌కు చెందిన దోమకొండ అనణ్యను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదివారం అభినందించారు. గంభీ రావుపేట మండలం ముస్తాఫనగర్‌లో ఓ శుభ కార్యక్ర మంలో పాల్గొనేందుకు కేటీఆర్ విచ్చేయగా, రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన అనన్య కలిసింది. దీంతో కేటీఆర్ అనన్యకు శాలువ కప్పి అభినందించారు. బీఆర్‌ఎస్ నాయకులు బండ రమేష్, ఉపసర్పంచ్ శివంది దేవేం దర్, వార్డు సభ్యులు వీరబోయిన రమేష్ తదితరులు ఉన్నారు.
అలాగే మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నా యకుడు యాదిలాల్ కుమారుడు రిసెస్పన్ కు కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముస్తాఫనగర్‌లో ఇటీవల వార్డు సభ్యుడు రమేష్ కుమారుడి పెళ్లి జర గగా కొత్త వధూవరులను ఆశీర్వదించారు.వెంట నాఫ్స్ కాబ్ చైర్మన్ రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకట స్వామి, సెస్‌డైరెక్టర్ నారాయణరావు, ఉపస ర్పంచ్ కమలాకర్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్, చేరాల వెం కటస్వామి, స్వామి, మీనయ్య తదితరులు ఉన్నారు.